చిన్న కుమార్తెగా…

11 January, 2019 - 4:34 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్ చిత్రం ఇటీవలే విడుదల అయింది. అయితే ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి. ఈ పాత్రలో హైదరాబాద్‌కు చెందిన కోమలి ఒదిగిపోయి నటించారు. కాగా.. కోమలి తాజా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు వెల్లడించారు.

ఈ పాత్రలో నటించేందుకు ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, కుమార్తెలు పురందేశ్వరి, లోకేశ్వరి చెప్పిన సలహాలు, సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అలాగే తన చిన్నానాటి ఫోటలను ఈ సందర్భంగా ఉమా మహేశ్వరి … తనకు దగ్గర ఉండి మరీ చూపించారన్నారు.

యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్‌లో ప్రస్తుతం చదువుతున్నట్లు తెలిపింది. అలాగే ఎన్టీఆర్ మొదటి భాగంలో తన పాత్ర కొద్ది సేపు మాత్రమే ఉంటుందని.. కానీ రెండో భాగం మహానాయకుడులో మాత్రం తన పాత్ర కీలకం కానుందని వివరించింది కోమలి తెలిపింది.