వెండి తెరపై ‘చిత్రలహరి’ రెడీ

08 April, 2019 - 4:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కిశోర్ తిరుమల దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం చిత్రలహరి. ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. పూర్తి కామెడి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యు సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.

ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిన్, నివేదా హేతురాజ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ రిలీజ్ అయి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కిషోర్ తిరుమల గతంలో ఉన్నది ఒక్కటే జిందగీ, నేను శైలజ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.