చిత్రలహరి ఫస్ట్ డే కలెక్షన్

13 April, 2019 - 6:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం చిత్రలహరి. ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిన్, నివేదా పేతురాజ్ నటించారు. ఈ చిత్రానికి నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

ఈ చిత్రం మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 3.81 కోట్ల షేర్ వచ్చింది.

చిత్రలహరి తొలి రోజు ఏరియా పరంగా కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి…

నైజాం: 0.79 కోట్లు

సీడెడ్ : 0.51 కోట్లు

యూఏ: 0.42 కోట్లు

తూర్పు : 0.38 కోట్లు

కృష్ణా: 0.24 కోట్లు

గుంటూరు: 0.30 కోట్లు

పశ్చిమ: 0.24 కోట్లు

నెల్లూరు: 0.24 కోట్లు

ఏపీ, టీస్: 3.02 కోట్లు

రెస్టా ఆఫ్ ఇండియా: 0.90 కోట్లు

ఓవర్సీస్: 1.50 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా : 12.80 కోట్లు