జగన్ ఎప్పుడైనా చెప్పారా ?

18 April, 2019 - 3:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి ఎన్ చినరాజప్ప గురువారం అమరావతిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుందని వైయస్ జగన్ ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ కేర్ టేకర్‌గా సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సమీక్షలు చేయకపోతే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని చిన రాజప్ప అన్నారు. వైయస్ జగన్ కుటుంబ సభ్యుల చేతిలోనే వైయస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని ఆరోపించారు.

ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ కోడెలపై ఇనిమెట్ల పోలింగ్ బూత్‌లో ఎలా దాడి చేశారో అంతా చూశారని చినరాజప్ప ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే అధికారులను బదిలీ చేశారని హోం మంత్రి చినరాజప్ప విమర్శించారు.