27న ప్రేక్షకుల ముందుకు చి.ల.సౌ!

10 July, 2018 - 3:58 PM

సుశాంత్‌, రుహానీశ‌ర్మ హీరో హీరోయిన్లుగా సిరుని సినీ కార్పొరేష‌న్ బ్యానర్‌‌పై రూపొందుతున్న చిత్రం ‘చి ల సౌ’. ఈ చిత్రంతో హీరో రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ విడుదల చేయబోతోంది. ఇటీవల విడుదలైన ‘చి ల సౌ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 27న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ… ‘ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్‌ని చూస్తారు. రియ‌ల్ లైఫ్‌‌లో సుశాంత్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఈ సినిమాలో త‌న‌ను అలాగే చూపిస్తున్నా. టైటిల్ విని ఇది ట్రయాంగిల్ ల‌వ్‌‌స్టోరీ అనుకోవ‌ద్దు. సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం ఉండ‌టంతో ద‌ర్శకుడిగా మారాను. హీరోగా కూడా సినిమాలు చేస్తాను. ఈ సినిమా త‌ర్వాత హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాను’ అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ… ‘కథ బాగా నచ్చి చేస్తున్న సినిమా ఇది. రాహుల్ చాలా అద్భుతంగా ఈ చిత్రం తెరకెక్కిస్తాడని నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచి లవ్ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది’ అన్నారు.

సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీఫ్ కో డైరెక్టర్: డి. సాయికృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.