‘పేరు మార్చితే సరిపోదు’

12 January, 2018 - 3:35 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: పద్మావత్ సినిమాకు భారత సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇంకా వివాదాలు సద్గుమణగడం లేదు. పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా మరోసారి కర్ణిసేన సభ్యులు ఆందోళన చేపట్టారు. కేవలం సినిమా టైటిల్‌ను పద్మావతి నుంచి పద్మావత్‌గా మారిస్తే సరిపోదని డిమాండ్ చేస్తూ..కర్ణిసేన సభ్యులు ముంబైలోని సీబీఎఫ్‌సీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీబీఎఫ్‌సీ ఆఫీస్ వద్దకు చేరుకున్న పోలీసులు, 96మంది కర్ణిసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకుని గందేవి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పద్మావత్ సినిమాను కొన్ని రాష్ర్టాలు మినహా అన్ని ప్రాంతాల్లో జనవరి 25న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.  రాజస్థాన్ లో సినిమాను విడుదల కానివ్వబోమని సీఎం వసుంధర రాజే ప్రకటించిన సంగతి తెలసిదే..