ఓటుహక్కునూ వదులుకున్న బాబు

14 March, 2018 - 12:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసు, అనంతర పరిణాలతో ఉమ్మడి రాజధాని (హైదరాబాద్‌)పై హక్కుల్ని వదులుకుని వెళ్లిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా తన ఓటు హక్కును కూడా వదులుకున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్న నారా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏపీలోని మంగళగిరి నియోజకవర్గానికి బదిలీ అయ్యారు.చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి కూడా తమ ఓట్లను మంగళగిరికి బదిలీ చేయించుకున్నారు. కృష్ణానది ఉండవల్లి కరకట్ట వద్ద తాత్కాలిక అధికారిక నివాసంలో సీఎం చంద్రబాబు నివసిస్తున్నారు. అది తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తుండటంతో ఆ మేరకు దరఖాస్తు చేసుకోగా అధికారులు దర్యాప్తు చేసి, ధృవీకరించారు.
2014 ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.