ట్రైలర్‌లో ‘చాణక్య’

09 September, 2019 - 6:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తిరు దర్శకత్వంలో గోపిచంద్, మొహర్రిన్, జంటగా నటిస్తున్న చిత్రం చాణక్య. బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. దసరా కానుకగా విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్ర నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్ర టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. గోపిచంద్ హీరోగా నటిస్తున్న 26వ చిత్రంగా చాణక్య తెరకెక్కుతోంది.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్  బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇండో పాక్ స్పై నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతకుమందు గోపిచంద్ నటించిన చిత్రం పంతం. గోపిచంద్ నటించిన 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా మొహర్రిన్ కథనాయికగా నటించింది. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదన్న సంగతి తెలిసిందే. అయితే చాణక్య చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందనే టాక్ ఇప్పటికే టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.