ఈసారి రామ్‌చరణ్‌తో ….

02 December, 2018 - 3:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రంలో రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. అయితే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ … అదీ కూడా పక్కా మాస్ సాంగ్ ఉందట. ఆ సాంగ్‌లో రామ్ చరణ్‌తో కలసి డ్యాన్ చేసేందుకు క్యాథరిన్ ఇప్పటికే దర్శకుడు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఈ విషయం టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. కాగా ఈ పాటలో రామ్ చరణ్‌తో కలసి స్టెపులు వేసేందుకు పలువురు హీరోయన్ల పేర్లు తెరపైకి వచ్చాయట. కానీ బోయపాటి మాత్రం క్యాథరిన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రెండు పాటల మినహా షూటింగ్ అంతా పూర్తయిన సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రంలో క్యాథరిన్ సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే ‘జయజానకి నాయక’ చిత్రంలో కూడా క్యాథరిన్ ఐటమ్‌ సాంగ్‌ చేసిన విషయం విదితమే.

కాగా త్వరలో ఈ పాటపై చిత్రీకరణ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.