కాంట్రాక్టు ఉద్యోగులపై కీలక నిర్ణయం

10 July, 2019 - 8:29 PM

                (న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పలు వ్యవస్థాపరమైన మార్పులు జరుగుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని జగన్ సర్కార్ నియమించింది. ఈ అంశంలో అన్ని కోణాల్లో ఈ కమిటీ పరిశీలన జరిపి నివేదిక రూపొందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఆళ్ల నాని ఉన్నారు.