‘బుట్టబొమ్మ’ రిలీజ్

25 February, 2020 - 8:36 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల.. వైకుంఠపురంలో… . ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఈ చిత్రంలోని సామజవరగమన .. సాంగ్‌ను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించగా.. తమన్ స్వరాలు అందిస్తున్న వీడియో సాంగ్‌ను గతేడాది చివరిలో విడుదల అయింది.

ఈ సాంగ్ వ్యూస్ పరంగా కోట్లలో.. లైక్స్ పరంగా లక్షల్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనే ఓ చరిత్రను క్రియేట్ చేసింది. అయితే ఈ చిత్రంలోని అన్ని పాటలను వరుసగా విడుదల చేస్తుంది చిత్ర యూనిట్. మొన్న సామజవరగమన.. సాంగ్ విడుదల చేస్తే.. నిన్న డాడీ సాంగ్ విడుదల చేశారు. తాజాగా అంటే ఫిబ్రవరి 25వ తేదీన బుట్టబొమ్మ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ పాటలోని సాహిత్యం, తమన్ సంగీతం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డేల అభినయం అదిరిపోయిందనే చెప్పాలి.