మళ్లీ బాలయ్యతో

20 April, 2019 - 5:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తిరుమల: నందమూరి బాలకృష్ణతో తన తదుపరి చిత్రం ఉంటుందని ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రకటించారు. ఈ చిత్రం రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. శనివారం తిరుమలలో బోయపాటి శ్రీను .. తన ఫ్యామిలీతో శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం స్వామి వారి ఆలయం బయట బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. బాలయ్య బాబు హీరోగా నిర్మిస్తున్న చిత్రం తాలుక కథ గురించి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అవి త్వరలో ఓ కొలిక్కి వస్తాయని.. ఆ వెంటనే అధికారికంగా ప్రకటిస్తానని బోయపాటి పేర్కొన్నారు. ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.