నేపాల్‌లో వరుస బాంబు పేలుళ్ళు

27 May, 2019 - 1:40 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కాట్మండు: నేపాల్‌లో ఆదివారం మూడు వేర్వేరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ళలు నలుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాట్మండులోని సుకేధర, ఘట్టెకులో, నాగ్‌ధుంగా ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో సంబంధం ఉందని భావిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

కాట్మండు నగరం మధ్యలోని ఘట్టెకులో ప్రాంతంలో జనావాసాల్లో జరిగిన పేలుడులో ఒకరు మరణించినట్లు స్థానిక వార్తా పత్రికలు వెల్లడించాయి. రెండో పేలుడు నగర శివారులోని సుకేధరలో ఓ బార్బర్ షాపులో జరిగింది. పేలుళ్లకు సమీపంలోని గోడలు కూడా బీటలు వారాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాంబు పేలుళ్ళు జరిగిన స్థలాల వద్ద ఆర్మీ మొహరించింది. ఈ బాంబె పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటించలేదు.