ఏపీలో తొలి జాబితా ప్రకటించిన కమలదళం

17 March, 2019 - 7:19 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించింది. ఈ తొలి జాబితాలో 123 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. అయితే ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత పి.విష్ణుకుమార్ రాజుకు మళ్లీ విశాఖ నార్త్ నుంచి మరో సారి అవకాశం ఇచ్చింది కమలదళం.

శనివారం న్యూఢిల్లీలో బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లోని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌తో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఆదివారం జాబితాను విడుదల చేశారు.