భోరుమన్న అర్చన… హరితేజ సందడి

14 September, 2017 - 9:51 AM

మొన్నటివరకు తెలుగు బిగ్ బాస్ షోలో కోపాలు, మనస్పర్థలు, చిరాకులు, భిన్నభిప్రాయాలతో ఒకరిపైఒకరు రకరకాల ఆలోచనలతో కొనసాగగా.. గత రెండు రోజులుగా మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో సంతోషకరమైన ఏడుపులు ఎక్కువయ్యాయి. సెప్టెంబర్ 12న శివబాలాజీ భార్య మధుమిత ముందుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఆదర్శ్ భార్య గుల్నార్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే వీరి అబ్బాయి నిర్వాణ్‌ కూడా రావడంతో అక్కడి సభ్యుల మొహాల్లో ఆనంద బాష్పాలు నెలకొన్నాయి. అయితే ఇలా ఒక్కొక్కరి ఇంటి సభ్యుడికి సంబంధించిన వ్యక్తులు రావడంతో అర్చన మాత్రం తట్టుకోలేక బోరుమంటు ఏడ్చేసింది. తన కుటుంబ సభ్యులకు దూరంగా వుండటం, వారు ప్రతిక్షణం గుర్తొస్తూ వుండటంతో అర్చన వెక్కి వెక్కి మరీ ఏడ్చింది.

ఇక సెప్టెంబర్ 13న జరిగిన ఎపిసోడ్‌లో అర్చన వాళ్ల అమ్మ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో… అర్చన భోరుమంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలాగే కాసేపటి తర్వాత హరితేజకు కూడా బిగ్ బాస్‌ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హరితేజ భర్త దీపక్ ఎంట్రీ ఇచ్చాడు. దీపక్ రాకతో హరితేజ ఫుల్ ఖుషీలో వుంది. అలాగే ఎపిసోడ్ చివర్లో నవదీప్ సిస్టర్ దీప్తి ఎంట్రీ ఇచ్చింది. నవదీప్ మాత్రం ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా అందరితో కలిసి వుండటంతో తన వాళ్లని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ రాకుండా ఇంటి సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేస్తున్నాడు. ఇంటి సభ్యుల ఆనందంలో తన ఆనందం వెతికేసుకుంటూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాడు. తన సోదరి దీప్తి వచ్చినప్పటికీ.. ఎప్పటిలాగే హుషారుగా వుండటం నిజంగా అభినందనీయం. బిగ్ బాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌లతో ఆనందంగా వున్న వీరిలో ఇంకా మిగిలింది దీక్షాపంత్ మాత్రమే.

అయితే ఒకే దెబ్బకు ఫైనల్‌కు చేరిపోయిన శివబాలాజీ ఇక ఎలిమినేషన్ జాబితాలో లేరు కాబట్టి… ఈవారం ఎవరు ఎలిమినేషన్‌ అవుతారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. నవదీప్, హరితేజలు ఎలిమినేషన్ కాకుండా సేఫ్ అవుతారని,,… ఇక ఇంటి నుంచి వెళ్లిపోవడానికి దీక్షాపంత్, ఆదర్శ్, అర్చనలు ఎలాగో డిసైడ్ అయిపోయారు కాబట్టి.. ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది. 70రోజుల కాల వ్యవధి ముగింపుకు సమయం దగ్గరపడుతుండటంతో బిగ్ బాస్ సీజన్ 1 విజేత ఎవరూ కాబోతున్నారోననే ఉత్కంఠ పెరిగిపోతుంది. మరి ఈ సీజన్1 విజేత ఎవరు కానున్నారో చూడాలి.