కనిపిస్తోంది కానీ …

07 November, 2019 - 4:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: వెంకీ కుడుముల దర్శకత్వంలో నితీన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. సింగిల్ ఫర్వేవర్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్స్ గురువారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నా లవ్వు కూడా విజయమాల్యా లాంటిదిరా.. కనిపిస్తోంటుంది కానీ.. క్యాచ్ చేయలేం.. అంటు హీరో నితీన్ పలికే డైలాగ్.. ఈ ఫస్ట్ గిమ్స్ కి మరింత అందాన్ని తెచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు..చింపేశారంటూ హీరో నితీన్ మాట్లాడకూండ.. సైగలతో  చూపించడం చాలా బాగుందని ఈ ఫస్ట్ గ్లిమ్స్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.  నితీన్, రష్మిక జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. అయితే రష్మికని టాలీవుడ్‌కి పరిచయం చేసిందే వెంకీ కుడుముల.

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో చిత్రంలో నాగ శౌర్య సరసన రష్మిక నటించిన సంగతి తెలిసిందే. అలా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఈ చిత్రంలో మహేశ్‌ బాబు పక్కన రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే.