పాట విడుదల వాయిదా

12 May, 2019 - 7:20 PM

(న్యూవేవ్స్ డెస్క్)

భరత్ కమ్మా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 26న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో మొదటి పాటిను ఇప్పటికే విడుదల చేశారు.

అయితే ఈ చిత్రంలోని రెండో పాటను మే 12వ తేదీ ఆదివారం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా ఈ పాటను ఆదివారం విడుదల చేయలేకపోతున్నామని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఇంకా ఆయన ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే… మీరు ఈ పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ప్రతి క్లాస్‌లో ఇతరుల దృష్టి మళ్లించే ఓ చెడ్డ విద్యార్థి ఉన్నట్లే … హీరో విజయ్ దేవరకొండ మమ్మల్ని పని చేసుకోనివ్వడం లేదు. దీనికి క్షమాపణ కోరుతున్నా’ అని ఆయన తెలిపారు. ఈ పాటను మే 15 వ తేదీ ఉదయం విడుదల చేస్తామని ప్రకటించారు.