కట్స్ లేకుండా ‘భరత్’ సెన్సార్ పూర్తి

17 April, 2018 - 2:52 PM

సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కైరా అద్వాని జంటగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 20న భారీ స్థాయిలో విడుదల కానుంది. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.

ఈ సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువైంది. మొత్తం రన్ టైం 173 నిమిషాలు.. అంటే దాదాపు మూడు గంటల సినిమా. భరత్ అనే నేను అవుట్ అండ్ అవుట్ మహేష్ వన్ మ్యాన్ షో అని తెలిసింది. ఇంత వరకు చేయని పాత్రలో మహేష్ చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించాడని టాక్.మొత్తానికి సెన్సార్ రిపోర్ట్ ఫాన్స్‌ని గాల్లో తేలేలా చేస్తోంది. సెన్సార్ బోర్డ్ సింగిల్ కట్ కూడా ఈ సినిమాకు సూచించలేదని తెలిసింది. కొరటాల శివ గత సినిమాల్లో కూడా వయొలెన్స్ ఉన్నప్పటికీ మంచి మెసేజ్‌తో పాటు హీరోయిజంను ఎలివేట్ చేయటం అతని స్టైల్. ఇందులో అది పదింతలు ఎక్కువగా చూపించారని.. శ్రీమంతుడి కన్నా ఎన్నో రెట్లు ఎంటర్‌టైన్మెంట్ ఇందులో ఉంటుందని మూవీ యూనిట్ చెబుతోంది.
శరత్ కుమార్, ప్రకాష్‌రాజ్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకి, మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

మహేశ్‌బాబు తొలిసారి ఓ పొలిటికల్ సినిమాలో అందులోనూ ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. ట్రైలర్లో మహేశ్‌బాబు చెప్పిన డైలాగులు సినిమాపై క్రేజ్‌ను మరింతగా పెంచాయి.