కిడ్నాపైన ఐటీ అధికారి కుమారుడి హత్య

22 September, 2017 - 1:53 PM


(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: బెంగుళూరులో కిడ్నాప్‌కు గురైన ఆదాయపన్నుశాఖ అధికారి కుమారుడు హత్యకు గురయ్యాడు. బెంగుళూర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న 19 ఏళ్ల శరత్ సెప్టెంబర్ 12వ తేదీన కనిపించకుండాపోయాడు. ఆ రోజున సాయంత్రం స్నేహితులను కలిసేందుకు శరత్ తన కొత్త బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే, రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో అందోళనకు గురయిన అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనను ఎవరో కిడ్నాప్ చేశారని, విడిపించేందుకు రూ.50 లక్షలు చెల్లించాలంటూ శరత్ మొబైల్ నుంచి తల్లిదండ్రులకు వ్యాట్సాప్ వీడియో మెసేజ్ వచ్చింది. అనూహ్యంగా శుక్రవారం బెంగళూరులోని ఓ చెరువు వద్ద శరత్ శవమై తేలాడు. ఈ కేసుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు.