మళ్లీ మళ్లీ బాలయ్యతో…

11 February, 2019 - 4:02 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

బోయపాటి శ్రీను అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పడుతున్నారు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం విదితమే.

అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని టాలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ ఎంత హిట్‌ను సాధించాయో అందరికీ తెలిసిందే. అలాగే వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా వస్తున్న మూడో చిత్రం ఇది. ఈ చిత్రం కూడా మంచి విజయం సొంతం చేసుకుంటుందని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ భావిస్తున్నారు.

కాగా బాలయ్య బాబుకు తగ్గ కథను ఇప్పటికే బోయపాటి సిద్ధం చేసుకున్నారట. అందుకు సంబంధించిన కథను కూడా బాలకృష్ణకు బోయపాటి వినిపించారట. అందుకు బాలయ్య బాబు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. కాగా ప్రస్తుతం బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం మహానాయకుడు చిత్ర పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ ఫిబ్రవరిలోనే విడుదల కానుంది. ఈ చిత్రం అయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటిస్తారని సమాచారం.