షాక్‌లో నందమూరి ఫ్యాన్స్‌

29 November, 2019 - 7:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడెప్పుడా అని బాలయ్య ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తోంది. మోక్షజ్ఞ విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.. ఆ సినిమాకి దర్శకుడు ఇతడే అంటూ టాలీవుడులోని పలువురు ప్రముఖ దర్శకుల పేర్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. దాంతో మోక్షజ్ఞ సినిమా వస్తోందంటూ నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

అయితే మోక్షజ్ఞ ఫొటో ఒకటి .. తాజాగా సోషల్ మీడియాతోపాటు మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో మోక్షజ్ఞ… చాలా లావుగా ఉన్నారు. అంతేకాదు.. హీరోగా కనబడాలంటే.. సిక్స్ ప్యాక్‌లో ఉండాలి. కానీ మోక్షజ్ఞలో అవి కనబడకపోవడంతో.. నందమూరి ఫ్యాన్స్ షాక్‌ తిన్నారని సమాచారం. సదరు ఫొటోలో న్యూ లూక్‌తో బాలయ్య బాబు ఉండగా.. ఆయన భార్య వసుంధర, బాలయ్య బాబు చిన్న అల్లుడు ఎం. భరత్ తదితరులు ఉన్నారు.

మరో వైపు బాలయ్య బాబు నటిస్తున్న తాజా చిత్రం రూలర్. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, భూమిక, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.