‘పైసా వసూల్’ సీన్లు లీక్!

31 August, 2017 - 11:23 AM


దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 101వ చిత్రం ‘పైసా వసూల్’. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సెప్టెంబర్ 1వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ‘పైసా వసూల్’ చిత్రానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో లీకై హల్చల్ చేస్తున్నాయి.

సినిమాల్లోని ఓ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్‌గా తెలుస్తోంది. ఇక కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాలయ్య ‘తేడాసింగ్’ పాత్రలో నటించాడు. బాలయ్య సరసన శ్రియ సరన్, ముస్కాన్ సేతి, కైరా దత్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో బాలయ్య పాడిన ‘మావ ఏక్ పెగ్ లా..’ అనే పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్ 1వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పైసా వసూల్’ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.