కొరటాల శివ కథ సిద్ధం

05 January, 2019 - 9:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ ఎన్టీఆర్ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ఎన్టీఆర్ కథనాయకుడు మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. అలాగే రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరిలో విడుదల కానుంది.

దీంతో బాలయ్య నటిస్తున్న 103, 104 చిత్రాలు పూర్తి కానుంది. మరి బాలయ్య బాబు 105 చిత్రం ఎవరి దర్శకత్వంలో చేస్తున్నారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్నారని టాలీవుడ్ లో వైరల్ అవుతోంది.

బాలయ్య కోసం కొరటాల శివ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ కథను వినిపించేందుకు ఇప్పటికే బాలయ్య… అపాయింట్ మెంట్ ను శివ కోరారట. కానీ బాలయ్య ఎన్టీఆర్ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారని… కొద్ది రోజులు ఆగాలని బాలయ్య మేనేజర్… శివకు సూచించారని సమాచారం.

కాగా.. ఇప్పటికే దర్శకులు బోయపాటి, అనిల్ రావిపూడిలతో ఓ చిత్రం చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరి  బాలయ్య  105 చిత్రానికి దర్శకుడు ఎవరు అనేది మాత్రం త్వరలో తెలయనుంది.