బాబుతో బాబా భేటీ

06 December, 2018 - 2:57 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యోగా గురు బాబా రాందేవ్ గురువారం అమరావతిలో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రావుపల్లిలో పతంజలి సంస్థ ఏర్పాటు చేయనున్న మెగా ఫుడ్ పార్క్‌ గురించి చంద్రబాబుకి వివరించిన బాబా రాందేవ్.

మెగా ఫుడ్ పార్క్‌కు 172.84 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. అనంతరం బాబా రాం దేవ్ మాట్లాడుతూ.. ఈ మెగా ఫుడ్ ద్వారా రూ. 634 కోట్లతో ఆహార శుద్ధితో పాటు అనుబంధ యూనిట్ల ఏర్పాటు చేస్తామని బాబా రాందేవ్ వివరించారు.

ఈ మెగా ఫుడ్ పార్క్ వల్ల 33, 400 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రసాయనాలు, పురుగు మందులు లేకుండా వ్యవసాయ ఉత్సత్తులు దిశగా కృషి చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.