లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘అవసరం’

07 March, 2019 - 2:52 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ చిత్రంలోని మరోపాటను బుధవారం విడుదల చేశారు. అవసరం అవసరం.. అంటూ సాగే పాట.. ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ సీఎం అయిన నాటి నుంచి పదవి కోల్పోయేంత వరకు సంఘటనల సమాహారంగా చూపిస్తూ.. ఈ పాటను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.

ఈ చిత్రం మార్చి 22 విడదల కానుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ మార్చి 15వ తేదీన ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందంటూ ఫిలిం నగర్‌లో టాక్ వైరల్ అవుతుంది. ఎందుకుంటే.. మార్చి 22వ తేదీన టాలీవుడ్‌లో మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. దాంతో థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఆ క్రమంలో మార్చి 15వ తేదీన ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తునట్లు తెలుస్తోంది.

కానీ దీనిపై చిత్ర యూనిట్ ప్రకటన చేయవలసి ఉంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతీ ఎంట్రీ ఇవ్వడం మొదలుకొని…. ఆ తర్వాత ఆయనకు పదవీ వియోగం వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రంగస్థల నటుడును వర్మ ఎంపిక చేశారు. అదే తరహాలో లక్ష్మీ పార్వతీ కోసం కన్నడ నటి యజ్ఞా శెట్టిని, అలాగే చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్‌ను సెలెక్ట్ చేశాడు వర్మ. ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.