(న్యూవేవ్స్ డెస్క్)
ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతోంది.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ భారీ స్థాయిలో జరిగిన విషయం విదితమే. ఈ వీర రాఘవుడు అమెరికాలోనూ తన సత్తా చాటుతున్నాడు. అక్కడ మొత్తం 194 ప్రాంతాల్లో ఈ చిత్రం విడుదలైంది.
యూఎస్‌లో మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ చిత్రం 707,698 డాలర్ల వసూళ్లు చేసింది. ఈ వీర రాఘవుడు.. కలెక్షన్లలో గతంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రాన్ని అధిగమించిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
యూఎస్‌లో ‘జైలవకుశ’ తొలి రోజు 589,219 డాలర్లు రాబట్టింది. తారక్ కెరీర్లో యూఎస్‌లో ఇంత స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ‘అరవింద సమేత’ అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందని యంగ్ టైగర్ అభిమానులు ఎంతో అతృతతో వేచి చూస్తున్నారు.