‘సీఎం సీట్లో కూర్చోవడానికి అనర్హుడు’

16 March, 2020 - 7:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ వ్యవహరించిన తీరును ఏపీపీసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ తులసి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్ కుమార్‌పై జగన్ చేసిన ఆరోపణలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. తులసిరెడ్డి ఆక్షేపించారు.

ఎన్నికల వాయిదాతోపాటు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లలను బదిలీ.. మాచర్ల సీఐపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి జగన్ అనర్హుడని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్‌కు సామాజికి వర్గాన్ని అంటగడ్డడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ చెపిన ఐదు కారణాలలో ఏ కారణం కూడా సమంజసంగా లేదన్నారు.