ఏపీ స్పీకర్ కోడెల సైకిల్ యాత్ర!

16 April, 2018 - 11:45 AM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా సీఎం చంద్రబాబు ఈ నెల 20న చేపట్టనున్న దీక్షకు మద్దతుగా ఈ నెల 19న శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైకిల్ యాత్ర నిర్వహించనున్నారు. ఈ సైకిల్ యాత్ర గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నుండి కోటప్పకొండ వరకూ జరగనుంది.

వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఈ సైకిల్ యాత్రలో పాల్గొంటారు. అలాగే ఈ నెల 20న నరసరావుపేట, సత్తెనపల్లిలో వేలాది మంది టిడిపి మద్దతుదారులతో పాటు భారీ సంఖ్యలో ఉద్యోగులతో కలసి స్పీకర్ కోడెల దీక్షలో కూడా పాల్గొంటారు.