నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం

22 June, 2019 - 8:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామక నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. జూన్ 23 లేదా 24 తేదీల్లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. జులై 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. అనంతరం జులై 10 తేదీలోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయనుంది. ఆ తర్వాత అంటే జులై 11 నుంచి 25వ తేదీలోపు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

ఎంపికైన వాలంటీర్లకు ఆగస్టు 5 నుంచి 10వ తేదీ వరకు ట్రైనింగ్ ఇస్తారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్లకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. గ్రామ వాలంటీర్‌కు రూ. 5 వేల వేతనం ఇవ్వనున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్‌ను నియమించాలని వైయస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నవరత్నాల అమలు బాధ్యతను గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించనున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో గ్రామ వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం పావులు కదిపింది.