మోదీకి చంద్రబాబు నిరసన లేఖ!

12 January, 2019 - 1:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి సంఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించడంపై సీఎం చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ ఆయన ప్రధాని మోదీకి రాసిన ఐదు పేజీల లేఖలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం చర్య రాష్ట్రాలను భయపెట్టే విధంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఐఏ దర్యాప్తునకు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ ఆ లేఖలో ప్రధాని మోదీని చంద్రబాబు కోరారు.

దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద చర్యల విషయంలో మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలనే నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అయినప్పటికీ సంబంధం లేని విషయాల్లో ఎన్ఐఏ జోక్యం చేసుకుంటోందని చంద్రబాబు ఆ లేఖలో ఉటంకించారు.