నారావారిపల్లెకి చంద్రబాబు ఫ్యామిలీ !

13 January, 2018 - 3:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: సంక్రాంతి సంబరాలు జరుపుకునేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు శనివారం తమ సొంతూరు చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకి పయనమవుతున్నారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు నారావారిపల్లెలోని తమ స్వగృహానికి చేరుకోనున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో ఆయన కుటుంబసభ్యులతో సహా పాల్గొననున్నారు. తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. కులదైవమైన నాగాలమ్మ ఆలయం వద్ద చంద్రబాబు కుటుంబం సంక్రాంతి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రతి ఏడాదీ పరిపాటిగా వస్తోంది. 15వ తేది మధ్యాహ్నం వరకు చంద్రబాబు సొంతూర్లోనే ఉండి, 16న తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఇప్పటికే నారావారి పల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీటీడీ కల్యాణ మండపంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు నారా భువనేశ్వరి బహుమతులు అందజేశారు.