‘అయ్యప్ప’ సినిమాలో అనుష్క

12 March, 2019 - 7:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: స్వీటి అనుష్క… కొత్త సినిమాలో నటించేందుకు ఓకే చేశారట. అదీ భక్తిరస ప్రధానం చిత్రం అని తెలుస్తోంది. శబరిగిరిశీడు అయ్యప్ప స్వామి చుట్టు సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.

సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుందట. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీత స్వరాలు సమకూర్చనున్నారు.

బాహుబలి, భాగమతి చిత్రాల్లో నటించిన అనుష్క.. ఆ తర్వాత సైలెన్స్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.