‘సాహో’లో కీలకపాత్రలో అనుష్క?

13 January, 2018 - 4:25 PM

‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో దక్షినాది స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించబోతోందని గత కొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై సాహో చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. కానీ.. తాజాగా సాహో షూటింగ్‌లో అనుష్క పాల్గొన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను నటుడు మురళీశర్మ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

సాహో సెట్లో అనుష్క, చిత్ర దర్శకుడు సుజిత్, సినిమాటోగ్రాఫర్ మదితో కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫోటోను మురళీశర్మ పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూస్తుంటే ‘సాహో’లో అనుష్క ఓ కీలక పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నదని తెలుస్తోంది. ఓ సీన్‌లో ప్రభాస్‌కు హెల్ప్ చేయడానికి అనుష్క ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ క్యారెక్టర్లో అనుష్క అయితేనే బాగుంటుందని దర్శకుడు సుజిత్ భావించి చేయిస్తున్నాడట. ఇందుకు సంబంధంచిన వివరాలననీ త్వరలోనే తెలుస్తాయి.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ నెగెటివ్ పాత్రలో నటిస్తుండగా.. తమిళ యువ హీరో అరుణ్ విజయ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో యాక్షన్, స్టంట్స్‌ హైలెట్‌గా ఉంటాయని సమాచారం.

బాలీవుడ్ సంగీత త్రయం శంకర్, ఎహసన్, లాయ్ సాహో సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విజయదశమి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.