జగన్ కేసు 28కి వాయిదా

14 February, 2020 - 4:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన తదుపరి విచారణ సీబీఐ, ఈడీ కోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. అయితే ఫిబ్రవరి 14వ తేదీ అంటే ఈ రోజు విచారణకు హాజరవకుండా.. జగన్ కు మినహాయింపు లభించింది. ముఖ్యమంత్రిగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని.. తమ వద్ద విచారణ పెండింగ్ లో ఉందన్న విషయాలను సీబీఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లి.. మినహాయింపు పొందవచ్చునని హైకోర్టు సూచించింది.

ఇదే విషయాన్ని జగన్ తరఫు న్యాయవాదులు.. సీబీఐకు విన్నవించారు.   హైకోర్టు సూచనను సీబీఐ న్యాయవాది ద్వారా నిర్ధారించుకున్న తర్వాత.. సీబీఐ న్యాయస్థానం జగన్ కు మినహాయింపు నిచ్చింది. కాగా ఈ కేసులో సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి ఈ రోజు నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు.

కాగా సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అయితే బుధవారం ప్రధాని మోదీతో జగన్ భేటీ అయిన విషయం విదితమే. కాగా అదేరోజు హోం మంత్రితో జగన్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ రోజు జగన్ కు హోం మంత్రి అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో.. మళ్లీ శుక్రవారం అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు.