చంద్రబాబు రాజీనామా ఆమోదం

23 May, 2019 - 3:03 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి ఎన్ చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు పంపారు. ఆయన వెంటనే చంద్రబాబు రాజీనామాను ఆమోదించారు. అయితే తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబును గవర్నర్ నరసింహన్ విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన సేవలకు గవర్నర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు చంద్రబాబు ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

17వ సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరగగా.. 4 రాష్ట్రాలు ఏపీ, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఓట్ల లెక్కింపు మే 23వ జరిగింది. ఈ ఎన్నికల్లో ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాల్లో అధిక్యం ప్రదర్శిస్తుండగా.. టీడీపీ 24 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే లోక్ సభ స్థానాల్లోనూన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో, టీడీపీ ఒక్క స్థానంలో అధిక్యతలో ఉంది.