ఈపాప అర్జున్‌రెడ్డి అమ్మను చూపిస్తుందట!

14 September, 2017 - 11:54 AM


చీమ ఏనుగులు జోకులు చెప్పే యాంకర్ లాస్య … ఇపుడు ఏకంగా అర్జున్ రెడ్డి అమ్మను చూపిస్తా నీకు అంటూ సుధీర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది. ఈ అమ్మడు పెళ్లైన తర్వాత కాస్త తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘సై సై సయ్యారే’ అనే కార్యక్రమంలో హాట్ డ్రెస్‌లో రొమాంటిక్ సాంగ్‌కు డాన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. ఎప్పుడూ సాంప్రదాయబద్ధంగా కనిపించే లాస్య ఏంటీ ఇలాంటి డ్రెస్సులో ఎంట్రీ ఇచ్చిందని అందరూ అనుకున్నారు.

ఇదిలా వుంటే గతంలో జరిగిన ‘ఢీజోడి’ డాన్స్ కార్యక్రమంలో లాస్య రెండు సీజన్‌లలో విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘ఢీ10’ డాన్స్ కాంపిటీషన్‌లో మరోసారి లాస్య సడన్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది. ఇప్పటివరకు సుధీర్, రష్మీ, వర్షిని, హేమంత్‌లు నాలుగు టీం లీడర్స్‌గా వున్నారు. అయితే హేమంత్ స్థానంలో టీం లీడర్‌గా లాస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. లాస్య వచ్చిరాగానే సుధీర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది.

పైగా.. ‘ఒక్కసారి టైటిల్ విన్ అయినందుకే ‘అర్జున్ రెడ్డి’ లెవల్లో యాటిట్యూడ్ చూపిస్తే… రెండుసార్లు టైటిల్ విన్నర్ ఇక్కడ… అర్జున్ రెడ్డి అమ్మను చూపిస్తా’ అంటూ సుధీర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే సరదాగా మాట్లాడే లాస్య ఇలా ఒక్కసారిగా భారీ మాటలు మాట్లాడేసరికి సోషల్ మీడియాలో ఈ అమ్మడు హాట్ టాపిక్‌గా మారింది. మరి లాస్య ఈ ‘ఢీ10’ షోలో టీం లీడర్‌గా కొనసాగుతుందో లేక మధ్యలోనే వెళ్లిపోతుందో అనే విషయం త్వరలోనే తెలియనుంది.