రంగా.. రంగా.. రంగస్థలాన ‘రంగమ్మత్త’!

19 March, 2018 - 3:28 PM

విశాఖ సాగర తీరంలో ఆదివారం రాత్రి జరిగిన రంగస్థలం ప్రీ రీలీజ్‌ ఫంక్షన్‌లో తన పాత్ర గురించి హాట్ యాంకర్‌ అనసూయ ఎంతో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. ఆ పాత్ర చేయటం తనకు అస్సలు ఇష్టం లేదని.. కానీ సుకుమార్‌ బలవంతం మేరకు తాను ఆ పాత్ర చేశానని చెప్పింది. ఆ తర్వాతే రంగమ్మత్త పాత్ర విలువేంటో తెలిసి ట్రావెల్‌ చేశానని అనసూయ చెప్పింది.

అంతలా ఆ పాత్రలో ఏం స్పెషాలిటీ ఉందా? అనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రంగమ్మత్త పాత్రకు సంబంధించి పోస్టర్‌‌ను చింత్రం యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇప్పటి వరకూ క్లాస్‌, గ్లామర్‌ పాత్రల్లో కనిపించిన అనసూయ.. రంగస్థలంలో పూర్తిగా డీ గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది.

సాధారణంగా సుకుమార్‌ సినిమాల్లో ప్రతీ చిన్న పాత్రకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆ లెక్కన రంగస్థలంలో రంగమ్మత్త పాత్రకు కూడా ఏదో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే అనసూయ ఓకే చేసి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

రామ్‌‌చరణ్‌, సమంత లుక్కులు ఎప్పటి నుంచో వైరల్‌ అవుతున్నప్పటికీ అనసూయ పాత్ర విషయంలోనే కొద్దిపాటి సస్పెన్స్‌ మెయింటెన్‌ చేశారు. రంగమ్మత్త పోస్టర్‌ ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది.