రికార్డులు మీద రికార్డులు

11 February, 2020 - 8:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం అల.. వైకుంఠపురంలో.. ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే సస్సెన్షన్ క్రియేట్ చేస్తుంది. సామజవరగమనా.. సాంగ్ విడదలై.. వ్యూస్ పరంగానే కాదు.. లైక్‌లు పరంగా కొత్త చరిత్రను సృష్టించాయి. అలాగే ఈ చిత్రం విడుదలై.. సరికొత్త సంచలనాలకు తెర తీసింది.

అంతేకాదు బాహుబలి రికార్డులను సైతం ఈ చిత్రం బద్దలు కొడుతోంది. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే రూ. 230 కోట్లు వసూల్ చేసింది. అంతే కాదు.. యునైటెడ్ స్టేట్స్ లో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా 3 మిలియన్ డాలర్లను దాటిన దక్షిణాది చిత్రంగా రికార్డు సృష్టించింది.

తాజాగా ఈ చిత్రం మరో రికార్డును అధిగమించింది. 1996లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా పెళ్లి సందడి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో 232 రోజుల్లో రూ. 98 లక్షలు వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

అయితే ఈచిత్ర రికార్డును 24 ఏళ్ల తర్వాత అంటే ఇటీవల విడుదలైన అల.. వైకుంఠపురంలో.. చిత్రం అధిగమించింది. ఈ చిత్రం సంధ్యా థియేటర్‌లో విడుదలై కేవలం 29 రోజుల్లోనే రూ. 98 లక్షలు వసూల్ చేసి పెళ్లి సందడి రికార్డును బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.