త్రివిక్రమ్ నెక్ట్స్ అల్లు అర్జున్‌తో…

09 October, 2018 - 5:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో అని టాక్ వైరల్ అవుతోంది.

ఇప్పటికే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ముచ్చటగా మూడో చిత్రం వీరి కాంబినేషన్‌లో రానుంది. నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా  తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమా ఏదీ పట్టాలెక్కలేదు.

విక్రమ్ కె కుమార్‌తో అల్లు అర్జున్ ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. అయితే ఈ లోపు  త్రివిక్రమ్‌తో ఓ చిత్రాన్ని చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. ఈ క్రమంలో మరి కొద్ది రోజుల్లో త్రివిక్రమ్‌తో చిత్రంపై అల్లు అర్జున్ ప్రకటించే అవకాశాలున్నాయి.