దిల్ రాజు బర్త్ డే గిఫ్ట్

08 April, 2019 - 5:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8. ఈ నేపథ్యంలో ఆయనకు సోమవారం వెరైటీగా పుట్టిన రోజ శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. అల్లు అర్జున్ హీరోగా.. దిల్ రాజు నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ టైటిల్ ఖరారు చేశారు.

దీనికి ‘కనబడుట లేదు’ అనేది ఉప శీర్షిక పెట్టారు. హ్యాపీ బర్త్ డే AA అంటూ ఈ చిత్ర ప్రకటనతో పాటు టైటిల్ పోస్టర్‌ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది.

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరాం దర్శకత్వం వహించనున్నారు. గతంలో వేణు శ్రీరాం.. నేచురల్ స్టార్ నానీ నటించిన ఎంసీఏ.. మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో అల్లు అర్జున సరసన .. పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న విషయం విదితమే. అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటికే పలు చిత్రాల్లో అల్లు అర్జున్ నటించారు. అదేవిధంగా అల్లు అర్జున్ నటించిన ఆర్య, పరుగు, డీజే చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన విషయం విదితమే.