‘మల్లు’కు సీఎం ఆహ్వానం

06 November, 2018 - 2:20 PM


(న్యూవేవ్స్ డెస్క్)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కేరళలో భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టైలిష్ స్టార్‌ని మలయాళీలు ‘మల్లు’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇటీవల కేరళను భారీగా వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రూ. 25 లక్షలు వరద సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

అయితే తాజాగా అల్లు అర్జున్‌కు కేరళ సీఎం పినరయి విజయన్‌ నుంచి ఆహ్వానం అందింది. కేరళలో 66వ నెహ్రూ ట్రోఫీ బోట్‌ రేస్‌ పోటీలు నిర్వహించనున్నారు. అలప్పుజ ప్రాంతంలోని పున్నమ్‌ద సరస్సులో ఈ పోటీలు నవంబర్‌10న జరగనున్నాయి.

కేరళలో గత 65 ఏళ్లుగా ఈ బోట్‌ రేస్‌ పోటీలు జరుగుతున్నాయి. పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట కేరళ ప్రభుత్వం ఏటా ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలు చూడటానికి లక్షలాది మంది ప్రజలు తరలివస్తుంటారు. సంవత్సరమంతా నిశ్శబ్దంగా ఉండే ఈ సరస్సు … పోటీలు నిర్వహించే రోజు మాత్రం అటు పర్యాటకులతో ఇటు పోటీదారులతో సందడిగా మారుతుంది.