కోరిక తీరుతోంది !

11 February, 2019 - 3:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా నరసింహరెడ్డి. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మామయ్య చిరంజీవితో కలసి నటించాలని ఉందని ఇప్పటికే పలు ఫంక్షన్లలో అల్లు అర్జున్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో త్వరలో అల్లు అర్జున్ కొరక తీరనుందని దీని ద్వారా తెలుస్తుంది. అయితే సైరా నరసింహరెడ్డి చిత్రంలో ప్రముఖ నటుడు నాగబాబు తనయ కొణిదెల నీహారిక కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. సైరా చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం విదితమే.

ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దసరా కానుకగా సైరా చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

సైరా చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా… తమ్మన్నా ఓ కీలక పాత్రలో ఒదిగిపోయి నటిస్తుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.