‘అందుకే గర్వపడుతున్నా’

30 November, 2018 - 3:03 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

టాలీవుడ్‌లో సామాజిక స్పృహ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఓటు వేయడం మన హక్కు, కులం, మతం, అబద్దపు హామీల ఆధారంగా ఓటు వేయవద్దంటూ ఓ చిన్నారి షార్ట్ వీడియోలో చెబుతుంది. ఈ వీడియోను అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

దయచేసి ఓటు వేయండి అంటూ ఈ వీడియోను రూపొందించింది తన స్నేహితురాలు మేఘనా జూపల్లి అని ఈ సందర్బంగా అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆమె మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు అని తెలిపారు. ఆమె సామాజిక అవగాహన కల్పించేందుకు ఈ వీడియోను రూపొందించారని అల్లు అర్జున్ వెల్లడించారు. తన స్నేహితురాలు రూపొందించిన ఈ వీడియోను షేర్ చేసినందుకు గర్వపడుతున్నానని అల్లు అర్జున్ చెప్పారు.