మందుబాబు హల్‌చల్

16 June, 2019 - 5:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ నీరుస్ సమీపంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మందుబాబు మద్యం తాగుతూ కారు డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు.

దాంతో అతడు తన చేతిలోని బీరు సీసాను మాత్రం పడేయకుండా అలాగే పట్టుకొని పోలీసుల ముందే తాగుతూ హల్‌చల్ చేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మరో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పట్టుబడివారి నుంచి 20 కార్లు, 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరందరికి సోమవారం బేగంపేటలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు చెప్పారు.