సామజవరగమన..

16 February, 2020 - 7:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ముచ్చటగా వచ్చిన మూడో చిత్రం అల.. వైకుంఠపురంలో.. .  ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రంలోని సామజవరగమన.. లిరికల్ సాంగ్‌ను గతేడాది అక్టోబర్‌లో విడుదల చేస్తే.. మిలియన్ల వ్యూస్‌తోపాటు లక్షల్లో లైకులను అందుకుని.. సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోయింది.

ఆ తర్వాత ఈ చిత్రంలోని పాటలు విడుదల అయినా.. అవి సినీ అభిమానులకు వినుల విందు చేశాయి. సామజవరగమన.. వీడియో సాంగ్ ను ఆదివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. దీంతో ఈ పాటలో సిరివెన్నెల సాహిత్యం, సిద్ శ్రీరామ్ గానం, తమన్ సంగీతం, హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, పూజా హెగ్డే అభినయంతోపాటు పారిస్ అందాలు మరింత ఆకర్షణగా నిలిచాయి.