చైతన్యతో శేఖర్ కమ్ముల

20 June, 2019 - 4:54 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: టాలీవుడ్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల తీరే వేరు. కథాకథనం, సంగీత పరంగా ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ నుంచి నిన్న మొన్నటి ఫిదా వరకు అన్ని మంచి విజయాన్ని అందుకున్నాయి.

తాజాగా ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో చైతన్య అక్కినేని హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం మంచి విజయాన్ని సొంతంచేసుకున్న సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కను ఈ చిత్రంలో చైతన్య జోడిగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పేర్లు త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించారు.