ఏపీ సెక్రటేరియట్‌లో మళ్ళీ లీకేజీలు

20 August, 2018 - 2:33 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో మళ్లీ వర్షం లీకేజీలు బయటపడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుసున్న వర్షాలకు ఏపీ సచివాలయంలోని మంత్రుల చాబర్లలోకి నీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు సీలింగ్‌‌లు ఊడిపడుతున్నాయి. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్నాథ్‌‌రెడ్డి, దేవినేని ఉమ చాంబర్లలో సీలింగ్‌ ఊడిపడి, ఏసీల్లోకి వర్షపు నీరు వచ్చిచేరింది.

4, 5వ బ్లాకుల్లోని పలు సెక్షన్లలో సీలింగ్‌ ఊడిపడింది. అసెంబ్లీ బిల్డింగ్‌‌లో కూడా పలు చోట్ల సీలింగ్‌ ఊడిపోయి వర్షపు నీరు భవనంలోకి వచ్చి చేరుతోంది. లీకేజీతో అసెంబ్లీ మొదటి అంతస్తులోని రిపోర్టింగ్‌ సెక్షన్‌‌లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది.