వర్మ మరో సంచలనం

18 April, 2019 - 7:56 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనం సృష్టించారు. ఈ చిత్రానికి ఇది అసలు కథ అంటూ ఉప శీర్షిక పెట్టి.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశారు.

అదే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్లు చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్ వేదికగా టైగర్ కేసీఆర్ అనే పోస్టర్‌ను విడుదల చేశారు ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు, ది అగ్రెస్సిన్ గాంధా అనే ఉప శీర్షికలు ఈ పోస్టరులో కనిపించాయి.

అయితే వర్మ ఇప్పటి వరకు దర్శకుడిగానే ఉన్నారు. కానీ ఇకపై ఆయన వెండి తెరపై కనిపించనున్నారు. కోబ్రా చిత్రం ద్వారా నటుడుగా వర్మ పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఇంటిలిజెన్స్ అధికారిగా వర్మ కనిపించనున్నారు.