నానితో…

09 February, 2019 - 6:01 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం జెర్సీ. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అందులోభాగంగా ఈ సాంగ్‌లో నటించేందుకు పలువురు హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. అయితే  చిత్ర దర్శకుడు మాత్రం ఆదా శర్మ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమెను ఇప్పటికే చిత్ర దర్శకుడు గౌతమ్ కలసి.. చర్చించినట్లు.. అందుకు ఆమె ఓకే కూడా చెప్పినట్లు సమాచారం.

క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ స్వరాలు సమకురుస్తున్నారు.  ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చాలా భాగం పూర్తి అయింది. మరి కొంత భాగం షూటింగ్ మిగిలి ఉంది. జెర్సీ చిత్రం ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు వచ్చిన ఈ భామ .. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో కూడా నటించిన విషయం విదితమే.