నటి రాశి కొత్త సినిమా షురూ

25 August, 2019 - 8:00 AM

కుటుంబ ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న సీనియర్‌ నటి రాశి. చాలా రోజుల తర్వాత ఆమె మరోసారి వెండితెరపై తళుక్కుమనబోతున్నారు. లైటింగ్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకం నిర్మిస్తున్న ఓ సినిమాలో రాశి నటిస్తోంది. ఈ మూవీకి సంజీవ్ దర్శకత్వం వహిస్తారు. నటి నందితా శ్వేతకు రాశి తల్లిగా కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అశోక్ కుమార్, చంద్రసిద్ధార్థ్, పోసాని కృష్ణమురళి, సి.కల్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. మూవీ యూనిట్‌కు వారంతా అభినందనలు తెలిపారు.